క్షేత్రస్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి రెవెన్యూ అధికారులతో సమావేశమై, “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) లో వచ్చిన అర్జీల పరిష్కారం, జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూఅప్పగింత, రీసర్వే, రెవెన్యూ సర్వీసులు, వాటర్ టాక్స్ తదితర అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో మంజూరు కాబడిన లేదా ప్రతిపాదించిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూఅప్పగింత ప్రక్రియను త్వరగా పూర్తీ చేసేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకనుగుణంగా పనిచేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. పిజిఆర్ఎస్ లో మరియు రెవెన్యూ సదస్సు లో వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యను అర్థం చేసుకొని అనాలసిస్ చేసి నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీల పరిష్కారానికి సంబంధించి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా ఎండార్స్మెంట్ చేశారా లేదా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ అధికారులను ఆదేశించారు. ప్రతి వారం రెవెన్యూ అంశాలపై వచ్చే ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత తహసిల్దార్ల తో మాట్లాడుతూ నాణ్యతతో ఆర్జీల పరిష్కారినికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులు పూర్తి అవగాహన కలిగి పని చేయాలన్నారు. రెగ్యులరైజేషన్ స్కీం 2025 ప్రక్రియ పై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అందుకనుగుణంగా ప్రతి పాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. . గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హౌస్ సైట్ పట్టాల కొరకు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వే ప్రక్రియ రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమన్నారు. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా రీసర్వే ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వక క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలన్నారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డిఓలు లక్ష్మిప్రసన్న, వెంకట శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు వరకుమార్, సత్యనారాయణ, శ్రీధర్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, వివిధ సెక్షన్స్ సుపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

