యోగాంధ్ర-2025 మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని.. యోగాంధ్ర-2025 మాసోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో ని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి అన్నీ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లాలో “యోగాంధ్ర 2025” మాసోత్సవాల నిర్వహణ ఏర్పాట్లుపై సమీక్షించి, దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని.. “యోగాంధ్ర 2025” పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, ముందస్తు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏఏ రోజు ఏఏ కార్యక్రమం నిర్వహించాలని, అందుకు చేపట్టవలసిన చర్యలపై గ్రామా, మండల, జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాలికలు రుపొందించాలన్నారు. దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యోగాంధ్ర 2025 ప్రాముఖ్యతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిల్లాలో ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్రస్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. అందులో భాగంగా జూన్ 18వ తేదీన 5 వేల మంది స్వయం సహాయక సభ్యులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని, అందులో భాగంగా మే 26వ తేదీన మరియు జూన్ 2, 8, 15 తేదీల్లో జిల్లా లోని పర్యాటక ప్రదేశాల్లో కనీసం వేయి మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. యోగ పై గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రధాన మునిసిపాలిటీలలో, ప్రతి గ్రామంలో యోగ ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియజేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రజలందరూ యోగా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో 100మంది మాస్టర్ ట్రైనర్స్ ను, మండల స్థాయిలో 200 మంది ట్రైనర్స్ ను గుర్తించి జాబితాను రుపొందించాలని జిల్లా కలెక్టర్, ఆయుష్ శాఖ అధికారులను ఆదేశించారు. యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలో యోగాంధ్ర-2025 మాసోత్సవాలను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా, మండ‌ల‌, గ్రామ, వార్డు స్థాయిల్లో క‌మిటీలు నియ‌మించాలన్నారు. ప్రత్యేకించి మండల స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఎస్ హెచ్ జీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు.. మొదలైన శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు. ప్ర‌జ‌లంతా ఈ నెల రోజులు జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావాల‌ని, అంత‌ర్జాతీయ యోగా వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. అంద‌రూ యోగా ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకునేలా అవగాహన పెంచాలన్నారు. ప్ర‌జ‌లు, వివిధ సంస్థ‌లు, మీడియా స‌హ‌కారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు యోగా మంత్ లో భాగంగా శిక్ష‌ణ‌లు, ప్ర‌త్యేక యోగాలు.. నిర్వ‌హించి, స్వ‌ర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగా హెల్దీ, హ్యీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాధ‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై తగుసూచనలు జారీ చేశారు.

జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్సకాలకు అనుగుణంగా జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ – 2025″ లో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, ఆయుష్ శాఖ ఆర్డిడి పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *