ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది కీలక పాత్ర అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ఒంగోలులోని ఎం. ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రకాశం జిల్లావర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభకి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలకపాత్ర పోషిస్తుంది. ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తోంది. మీడియా కల్పితాలు, కట్టుకథలు కాకుండా వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఒకరి మెప్పుకోసం తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని టార్గెట్ గా చేసి తప్పుడు వార్తలు ప్రచురించడం సమాజానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు, పత్రికలు, చానళ్లు ఎవరైనా సరే విమర్శల్ని సద్విమర్శలుగా స్వీకరించాలని అన్నారు. అకారణంగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే యావత్ సమాజం మొత్తం మీకు అండగా ఉంటుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, జర్నలిస్టుల మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎప్పుడు ముందుంటారని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.



