కంటోన్మెంట్ నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా….ఎమ్మెల్యే శ్రీ గణేష్.

కంటోన్మెంట్ మే 24(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజక వర్గాన్ని సమస్యలు లేని ఆదర్శ నియోజక వర్గం గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం వార్డు 2 రసూల్ పురా లోని మజీద్ లేన్, గన్ బజార్ హట్స్, మిలాద్ గల్లీ, అంబేద్కర్ నగర్ మరియు శ్రీలంక బస్తీ లలో పర్యటించి ప్రజల ను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.బస్తీలలో ముఖ్యంగా నీటి సమస్య, సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు మరియు డ్రైనేజీ సమస్య గురించి స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైనేజీల నిర్మాణం లాంటి సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే తమ ఇంటి వద్దకే వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడం పట్ల ఆయా బస్తీ ల వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *