భద్రతే నీ జీవితానికి నేస్తంఅది లేకుంటే జీవితం అస్తవ్యస్తం.ప్రమాదాలు ఉచితం . అవయవాలు ఉచితం కాదు…..నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు.రోడ్డు భద్రతపై అమీర్ పేట్ లోని క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ సిబ్బందికి అవగాహన.

బేగంపేట మే 24(జే ఎస్ డి ఎం న్యూస్) :
భద్రతే నీ జీవితానికి నేస్తం.అది లేకుంటే జీవితం అస్త వ్యస్తం. ప్రమాదాలు ఉచితం అవయవాలు ఉచితం కాదని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర రాజు అన్నారు.
హైదరాబాద్ కమీషనర్ సి.వి. ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సి.పి. జోయల్ డేవిస్
మరియు ట్రాఫిక్ 1 డి సి పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు
శనివారం బేగంపేట టిటిఐ ఆధ్వర్యంలో ఏసీపీ జి. శంకర్ రాజు మరియు ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ అమీర్ పేట్ లోని క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి నార్త్ జోన్ ఏ.సి.పి.జి. శంకర్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వేగం అంతిమ ప్రయాణం అవుతుందని తెలిపారు.వాహన దారులు అందరు రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి. ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని వల్ల వారి అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించడం వలన వారి యొక్క కుటుంబాలలో విషాదఛాయలు నెలకొంటున్నాయి అని చెప్పారు. బేగంపేట టి టి ఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని ,ఇది చట్టరీత్యా నేరం. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం అతి ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదాలు ఉచితం కానీ అవయవాలు ఉచితం కాదు అన్నారు. వాహనాలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా నడపరాదు. రోడ్డు భద్రత నియమాలను అందరూ తప్పకుండా పాటించాలి అని తెలియ జేశారు.ఈ కార్యక్రమములో సుమారు 350 మంది సిబ్బంది, జోనల్ రిస్క్ మేనేజర్ రవికుమార్, జియో సేల్స్ మేనేజర్ పి .భాస్కర్ రెడ్డి, జిఓ రికవరీ మేనేజర్ వెంకట రమణ, జిఓ కలెక్షన్ మేనేజర్ జగన్ మరియు ఎస్. ఆర్. నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ. రాంబాబు, బేగంపేట టిటిఐ సిబ్బంది అయాన్, కృష్ణ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *