విశాఖ పట్నం మే 24(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
యోగా భారతీయ వ్యవస్థలో సంప్రదాయంగా వస్తున్న ఒక వ్యవస్త అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో విశాఖ పోలీస్ ఆధ్వర్యంలో యోగ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు. 11వ యోగ వేడుకలలో హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా అంటేనే భారతీయ వ్యవస్థలో సంప్రదాయంగా వస్తున్న భాగమని అన్నారు. యోగా అంటే ఆసనాలు మేడం కాకుండా యోగ మన శరీరంలో ఒక భాగం అవ్వాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు అంటే దానికి యోగనే కారణమన్నారు. రోజుకు ఒక గంట సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామన్నారు. రానున్న జనరేషన్ యోగాను అందించడం లో మనం భాగస్వామ్యం అవుతున్నామన్నారు జూన్ 21 న జరగబోయే యోగ డేకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు.





