స్కిల్స్​ లేమితో బయటివారికి ఉద్యోగాలు – శిక్షణ అందించడంపై దృష్టిసారించాలికేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి.యువత, మహిళలు శిక్షణ పొంది అవకాశాలను అందిపుచ్చుకోవాలి -సికింద్రాబాద్​ పార్లమెంట్ పరిధిలో పలు బస్తీల్లో కమ్యూనిటీ హాల్​ నిర్మాణ పనుల పరిశీలన.

హైదరాబాద్​ మే 24(జేఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
హైదరాబాద్​ లోని యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన స్కిల్స్​ లేకపోవడం వల్ల బయటివారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని, ఇప్పటికే తమ ఆధ్వర్యంలో బర్కత్​ పురాలో ఓ స్కిల్​ సెంటర్​ లో మహిళలకు శిక్షణ ఇస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి అన్నారు.శనివారంసికింద్రాబాద్​ నియోజకవర్గంలోని రత్నానగర్​, సజ్జానగర్​ బస్తీల్లో పర్యటించారు. అక్కడి నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్​ నిర్మాణాలను పరిశీలించారు.
అనంతరం మీడియాతో కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి మాట్లాడారు.ముఖ్యంగా స్కిల్స్​ లేకపోవడం వల్లే స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని బయటి ప్రాంతాల వారు నగరంలో ఉద్యోగాలను దక్కించుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వం, నాయకులు, అధికారులు
ఈ విషయాన్ని గమనించి యువకులు, మహిళలకు అత్యధిక సంఖ్​యలో స్కిల్స్​ సెంటర్ల ద్వారా శిక్షణా నైపుణ్యాలను పెంపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే దక్కుతాయన్నారు. హైదరాబాద్​ లో ఉద్యోగాలు అధికంగా ఉంటాయని తెలిపారు. స్కిల్స్​ లేమి వల్ల స్థానికులకు ఈ ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. యువత, మహిళలుకూడాతమలోనినైపుణ్యాలను పెంచుకోవడంలో ప్రాధాన్యతనీయాలని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
తద్వారా ఆర్థికంగా కూడా పటిష్టం అవుతారని మంత్రి చెప్పారు. రత్నానగర్​, సత్య నగర్​ లలో చేపడుతున్న కమ్యూనిటీ హాల్​ లనిర్మాణాలను పరిశీలించానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నానగర్​ లో ఓ కమ్యూనిటీ హాల్​ నిర్మాణం చేపట్టానని చెప్పారు. ప్రస్తుతం బస్తీ జనాభా పరంగా విస్తరించినందున మరో కమ్యూనిటీ హాల్​ నిర్మిస్తున్నారని నిర్మాణ పనులను పరిశీలించానని చెప్పారు. ఈ బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్తీ దవాఖానాలు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం జీహెచ్​ ఎంసీ ఆధ్వర్యంలో నిధులను త్వరితగతిన కేటాయిస్తే సదుపాయాల కల్పనలో వేగం పెరుగుతుందని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *