సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారు -కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం -పొగాకు రైతు సమస్యలపై వైసీపీవి దిగజారుడు రాజకీయాలు -పొగాకు రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

సీఎం.ఆర్.ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంత్రి సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 49 మంది లబ్ధిదారులకు రూ.35 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..సీఎం. ఆర్. ఎఫ్ తో పేదల ఆరోగ్యానికి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని అన్నారు. సీఎం. ఆర్. ఎఫ్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడారని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల విద్య, వైద్యం, ఆరోగ్యానికి మా ప్రభుత్వం మెదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 70 ఏళ్ళు దాటిన వారికి పీఎంజేఎవై ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. పొగాకు రైతు సమస్యలపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. నాడు జగన్ కి పొగాకు రైతుల సమస్యలు కనపడలేదా ? అని ప్రశ్నించారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. బయ్యర్లు, కంపెనీలతో మాట్లాడి పొగాకు రైతులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు.పొగాకు రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *