కూకట్ పల్లి మే 26,(జే ఎస్ డి ఎం న్యూస్ ):
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
బాలనగర్ మండలం ఎమ్మార్వో కార్యాలయం లో 50మంది కి కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

