యోగా దినోత్సవంలో ప్రజల భాగస్వామ్యం పెంపుపై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టరు ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ అంశం పై సోమవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో ఆమె ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాసనాలలో మన జిల్లాలో 10 లక్షల మంది పాల్గొనేలా రిజిస్ట్రేషన్స్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం 4 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు చెప్పగా, లక్ష్యం దిశగా దృష్టి సారించాలని కలెక్టరు దిశా నిర్దేశం చేసారు. ట్రైనర్స్ ద్వారా ప్రజలకు శిక్షణ ఇప్పిస్తామని, ఇందులో భాగం గా తొలుత ట్రైనర్స్ కు అవసరమైన శిక్షణను మంగళవారం నుంచి మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఎంపీడీవో లను, మున్సిపల్ కమీషనర్లను ఆమె ఆదేశించారు.
జాయింట్ కలెక్టరు ఆర్.గోపాల కృష్ణ మాట్లాడుతూ …వచ్చే నెల 2, 8, 15 వ తేదీలలో ప్రత్యేక ఇతివృత్తాలతో పర్యాటక ప్రాంతాలైన త్రిపురాంతకం ఆలయం, పాకల బీచ్, కొత్తపట్నం బీచ్ లలోనూ భారీస్థాయిలో యోగాసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈఓ చిరంజీవి, శిక్షణా కార్యక్రమాల నోడల్ ఆఫీసర్ అయిన బి. సి కార్పోరేషన్ ఈ డి వెంకటేశ్వరరావు, హౌసింగ్ పి. డి శ్రీనివాస ప్రసాద్, డ్రామా పిడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకట నాయుడు, సిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ శాఖలకు సంబంధించిన కార్యకలాపాల పైనా జిల్లా అధికారులు తొలుత సమీక్షించారు.

