జూబ్లిహిల్స్ మే 27(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
జూబ్లిహిల్స్ లో కారు ప్రమాదం చోటు చేసుకుంది.మద్యం మత్తులో కారు నడిపిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి యాక్సిడెంట్ చేశాడు. అయితే ప్రమాదం నుంచి తాను తప్పించుకునేందుకు
నేరం నాది కాదు అంటూ.. తప్పించుకునే యత్నం చేశాడు.యాక్సిడెంట్ కేసులో వేరే వ్యక్తిని డ్రైవర్ గా చూపే ప్రయత్నం చేసాడు.అయితే సీసీ ఫుటేజ్ ద్వారా అసలు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.పోలీసుల అరెస్ట్ చేస్తారనే భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కారు వదిలేసి పరారయ్యాడు.మరుసటి రోజున వేరే వ్యక్తిని పంపి మేనేజ్ చేసేందుకు యత్నించాడు.అయితే
అప్పటికే సీసీ ఫుటేజ్ తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
నిందితుడు శిరీష్ తో పాటు అతడి స్థానంలో వచ్చిన వ్యక్తి నీ కూడా పోలీస్ లు అరెస్ట్ చేశారు.
