కౌలు రైతు పంట సాగు హక్కు పత్రాలు పొందాలి – తహసీల్దార్ కె సంజీవ రావు

కౌలు దారులు భూ యజమానుల అంగీకారంతో పంట సాగు పత్రాలు పొందాలని
తహసీల్దార్ కె సంజీవ రావు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ విఆర్ఓ లు ధృవీకరించిన కౌలు రైతులు అందరూ క్రాఫ్ కల్టివేషన్ రైట్స్ సర్టిఫికేట్ (సీ సీ ఆర్ సీ ) పొందవచ్చని చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ సాగు దారు పత్రం 11 నెలల పాటు చెల్లుబాటు అవుతుందని తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. నీ నీ ఆర్ నీ కార్డుల వలన పంట నష్టాలు, ఇన్ పుట్ సబ్సిడీ, ఇతర రాయితీలు అందుతాయని చెప్పారు. దేవాదాయ శాఖ భూములకు కూడ పంట సాగు హక్కు పత్రం పొందవచ్చని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *