మహిళలు వ్యక్తి గత ఆరోగ్య శుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని తూర్పుగంగవరం
పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బాలికలకు, మహిళలకు రుతు క్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య రక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారాన్ని వివరించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, హెచ్ ఈఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ ఎంవీ రమణమ్మ, హెచ్. వి సుశీల పాల్గొన్నారు.

