కూకట్ పల్లి మే 28(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వసంత నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.తెలుగు వారి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన గొప్ప మహానుభావుడు అని రాజకీయంగా ఎన్ టి ఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని కిలో 2 రూపాయల బియ్యం పథకం అమలు చేసి నిరుపేదల పాలిట దేవుడు అయ్యారని,క్రమశిక్షణ కు మారుపేరు ఎన్ టి ఆర్ అనీ ఆయన చూపిన మార్గం లోనే మేము ఇప్పటికీ నడుస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు.నాయకులు సాయి బాబు చౌదరి,శ్యామల రాజు. కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
