మహానాడులో బుధవారం రెండవ రోజు తాళ్లూరు తెలుగు తమ్ముళ్లు నందడి చేసారు. దర్శి నియోజక వర్గ ఇన్చార్జి, రక్తదాన శిబిరం కోఆర్డినేటర్ డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లను కలసి రక్తదాన శిబిరం విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు. అనంతరం పలువురు ప్రధాన నాయకులను కలసి మహానాడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారికి సంక్రాంతి బోగి, సంక్రాంతి, కనుమ పడుగ వలే మూడు రోజులు కాగా తెలుగుదేశం వారికి మహానాడు కూడా సంక్రాంతి వలె మూడు రోజులపాటు వైభవంగా జరుగుతుందని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు అన్నారు. కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య , ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా బాబు (బడే), మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షుడు బి ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, వెలుగు సుబ్బా రావు, నవులూరి విద్యా సాగర్, రామయ్య, పాశం సూరిబాబు (పెద్దన్న), పిన్నిక రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

