65 ఏళ్లు పై బడిన వారికి ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేయబడునని తహసీల్దార్ సంజీవ రావు అన్నారు. తాళ్లూరులో రేషన్ దుకాణాన్ని ఆదివారం పున: ప్రారంభించారు. టిడిపి ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, టిడిపి యువనాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కొత్త పాలెం గ్రామ టిడిపి అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, బీసీ నాయకుడు పిన్నిక రమేష్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని దుకాణాన్ని ప్రారంభించారు. ఎండీఎం వాహనాలు ఒకే చోట నిలిపి రేషన్ పంపిణీ చేయటం వలన అసౌకర్యం కలుగుతున్న కారణంతో వాహనాలన రద్దు చేసినట్లు చెప్పారు. దుకాణాల వద్ద నరుకులు ఇవ్వటం వలన కార్డు దారులు వారికి అనుకూల మైన సమయంలో రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. రాబోవు రోజులలో వీటిని మార్ట్ గా మార్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బియ్యం, చక్కరతో పాటు రాబోరు రోజులలో చిరుధాన్యాలు సైతం రేషన్ ద్వారా ఇవ్వనున్నట్లు, రేషన్ అవసరం లేని వారికి నగదు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలను వక్తలు గుర్తు చేసారు. రేషన్ నిర్వాహకులు నాదేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

