విద్యార్థులకు ఇంటిని మరపించే బోజనం అందివ్వాలని ఎంఈఓ -2 సుధాకర్ రావుఅన్నారు. తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలలో నూతన విద్యాసంవత్సరం అందించనున్న మోను కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈఓ–2 సుధాకర్ రావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సౌకర్యార్ధం సన్న బియ్యం కూడ ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో విద్యార్థులకు బోజనం మరింత నాణ్యతగా అందుతుందని తెలిపారు. మోను లోని పలు రకాలతో పాఠశాలలో పనిచేస్తున్న వంట వాళ్లకు, హేల్ఫర్స్కు పోటీలు నిర్వహించారు. పోటీలలో శివరామపురం ఎంపీపీఎన్ సాధించగా, ద్వితీయ బహుమతి వెలుగు వారి పాలెం యూపీ పాఠశాల, తృతీయ బహుమతి ఎంపీ పీఎన్, తూర్పుగంగవరం వారు సాధించారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎన్ ఆర్కే ప్రసాద్, ఎంఐఎన్ శ్రీనివాస రావు, సీఆర్పీ మారుతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమములో పి.ఏ.సి.యస్ అధ్యక్షులు వల్లపనేని సుబ్బయ్య , సోమా సుబ్బారావు ,సి.ఆర్.పి. బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు .

