చిన్నారులు వారి బాల్య దశ నుండే బంగారు భవిత వైపు అడుగులు వెయ్యాలి -జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – ఘనంగా ముగిసిన పోలీస్ చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంప్ -ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకలు గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ముఖ్య అధితిగా హాజరైనారు. ఈ ముగింపు వేడుకల్లో చిన్నారులు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపులో చిన్నారులకు ఎన్నో ఆటలు పట్ల మంచి శిక్షణ ఇప్పించామని, దాదాపు నెల రోజుల పాటు వారికి ఎన్నో వినోదభరితమైన, విజ్ఞానపరమైన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో చిన్నారులకు నాయకత్వ నైపుణ్యాలను, సామాజిక నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారని, వారిలో స్నేహభావం, సృజనాత్మకత టీమ్ వర్క్ వంటి లక్షణాలు ఏర్పడ్డాయని, వారి ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. పిల్లలకు విలువలతో కూడిన విద్య చాలా ముఖ్యమని, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఈ దిశగా సపోర్ట్ చేయాలన్నారు. కేవలం చదువే కాకుండా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇతర రంగాలలో రాణించే విధంగా నేర్పించాలన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలని, నిత్యము నేర్చుకునే తత్వాన్ని పెంపొందించుకోవాలని, తల్లిదండ్రుల, గురువుల మాటలు చక్కగా వింటూ బాగా చదువుకోని ఉన్నత శిఖిరాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు.
ఈ క్యాంపులో ఉదయం మరియు సాయంత్రం నైపుణ్యం కలిగిన క్రీడాకారుల కోచ్ ద్వారా క్రీడలను నేర్పించటం జరిగిందని, అదే విధంగా ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలకు ఆహ్లాదకరమైన క్రీడా వాతావరణంలో వివిధ రకాల టీమ్ స్పోర్ట్స్, వ్యక్తిగత క్రీడలు, టీమ్ బిల్డింగ్ గేమ్‌లు, ఫిట్‌నెస్ మరియు ఇతర ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీలను, పిల్లల శారీరక విద్యలో నిపుణులచే కోచ్ ఇవ్వటం జరిగిందని తెలియచేసినారు.

ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్ మరియు ఇతర పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఎస్పీ మెమెంటోస్ అందచేసినారు. చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ & గేమ్స్ కోచింగ్ క్యాంపు ను ఫలితావంతంగా, విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రెసిడెంట్ మరియు వివిధ రంగాలలోని నేషనల్ క్రీడాకారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, క్రీడాకారులు, చిన్నారు తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *