రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత.నార్త్ డిస్ట్రిక్ట్ 1 అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సి.వేణుగోపాల్ రెడ్డి.రోడ్డు భద్రతపై జే.బీ ఎస్ ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన.

హైదరాబాద్ జూన్ 10 (జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని నార్త్ డిస్ట్రిక్ట్ 1 ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సి.వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సి.పి. జోయల్ డేవిస్ డీసీపీ ట్రాఫిక్ 1 రాహుల్ హెగ్డే ల ఆదేశాల మేరకు బేగంపేట టిటిఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం జె .బి.ఎస్. ఆర్.టి.సి. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న
సి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీ జీ ఆర్ టి సి ) తన బస్సులలో ప్రతిరోజూ సుమారు 54 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుందన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎప్పుడు చేయకూడదన్నారు. వాహనాలు నిర్లక్ష్యం గా నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. అందరు తప్పని సరిగా జీవిత భీమా చేసుకోవాలన్నారు. జీవన శైలిలో భాగంగా ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలని తెలియజేసారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

టి టి ఐ ఇన్స్పెక్టర్ నాగుల అశోక్ మాట్లాడుతూ ఆర్.టి.సి. బస్సులో ప్రయాణం అంటేనే సురక్షిత ప్రయాణం అన్నారు. ఒక బస్సు లో సుమారు 50 నుండి 60 మంది ప్రయాణికుల ప్రాణాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయనీ, డ్రైవర్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా బస్సును నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అతి ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదాలు ఉచితం కానీ అవయవాలు ఉచితం కాదు అన్నారు. వాహనాలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా నడపరాదు. రోడ్డు భద్రత నియమాలను అందరూ తప్పకుండా పాటించాలి అని తెలియజేశారు.గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జుట్టు భాస్కర్ మాట్లాడుతూ వాహనాలు నిదానంగా నడపాలి అన్నారు. అతి వేగం అంతిమ ప్రయాణం అవుతుంది. ముఖ్యంగా సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దాని వల్ల వారి అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించడం వలన వారి యొక్క కుటుంబాలలో విషాదఛాయలు నెలకొంటున్నాయి అని చెప్పారు. ఈ కార్యక్రమములో సుమారు 150 మంది డ్రైవర్లు రీజినల్ మేనేజర్ ఎన్ .సుచరిత , అపర్ణ కళ్యాణి, జి.ఎన్. పవిత్ర డిప్యూటీ ఆర్.ఎం.ఓ, డిపో మేనేజర్ సుధాకర్ మరియు బేగంపేట టిటిఐ సిబ్బంది అయాన్, కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *