హైదరాబాద్ జూన్ 12(జే ఎస్ డి ఎం న్యూస్) :
వెన్నుములో క్యాన్సర్ కారణంగా నరాలపై ఒత్తిడితో కాలు పెరాలసిస్ స్టేజికి వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న మహిళకు బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో స్పైన్ సర్జన్ డాక్టర్ హిమాన్షు ప్రసాద్ నేతృత్వంలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి క్యాన్సర్ కనితిని పూర్తిగా తొలగించి రోగిని తిరిగి నడిచే స్థితిలోకి తీసుకొచ్చారు.మధ్యప్రదేశ్ కు చెందిన 55 సంవత్సరాల మహిళ కాలు వీకై నడవలేని స్థితిలో వీల్ చైర్ లో హాస్పిటల్ కి వచ్చారు. ఆమెనుపరీక్షించిన కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ స్పైన్ డాక్టర్ హిమాన్షు ప్రసాద్ వెన్నెముక భాగంలో క్యాన్సర్ కణితి పెరగడం వల్ల నరాలపై ఒత్తిడి పెరిగి కాలు నరాలు వీక్ కావడంతో పెరాలసిస్ స్టేజ్ లోకి వెళ్లినట్టు గుర్తించారు. పేషంట్ తిరిగి కోలుకునేందుకు శాస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని, అందుకోసం వెన్నెముకలో ఉన్న క్యాన్సర్ కణితిని తొలగించాలని నిర్ణయించి అందుకోసం ”ఎన్ బ్లాక్ రీసెక్షన్” శస్త్ర చికిత్స నిర్వహించాలని డాక్టర్ హిమాన్షు ప్రసాద్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం నిర్ణయించారు. మొదటి దశలో ఇంటర్వెన్షన్ “ఎంబోలైజేషన్” పద్ధతిలో రోగికి ఇంజెక్షన్ ఇచ్చి, క్యాన్సర్ కణజాలానికి రక్తప్రవాహాన్ని నిలిపివేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన 24 గంటల తర్వాత స్పైన్ సర్జన్ హిమాన్షు ప్రసాద్ నేతృత్వంలో స్పైన్ సర్జన్ ఆంజనేయులు రెడ్డి, న్యూరో ఎనస్టటిస్ట్ డాక్టర్ అనాగ్ చక్రవర్తి ఆధ్వర్యంలో “ఎంబోలైజేషన్” శాస్త్ర చికిత్సలో భాగంగా నావిగేషన్, న్యూరో మోనిటరింగ్ వంటి ఆధునిక శాస్త్ర చికిత్స విధానాలతో వెన్నెముకలో ఉన్న క్యాన్సర్ కణితిని పూర్తిగా తొలగించారు. క్యాన్సర్ కణితి తొలగించిన ప్రాంతంలో ఇంప్లాంట్ అమర్చి నరాలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా శస్త్ర చికిత్సను ఆరు గంటల్లో పూర్తి చేశారు.శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ నిర్వహించడం ద్వారా తిరిగి కాళ్ళలో నరాలు బలం చేకూరడంతో పాటు మళ్ళీ నడవగలిగే స్థితికి రోగిని చేర్చడం అంటే నిజమైన మెడికల్ మిరాకిల్ గా డాక్టర్లు తెలిపారు.కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వెన్నెముక వైద్య సేవలను అత్యాధునిక పద్ధతిలో నిర్వహిస్తున్నామని, 55 సంవత్సరాల మహిళకు స్పైన్ క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలగడం తమ వైద్యసాఫల్యానికి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.
