హైదరాబాద్ జూన్ 12(జే ఎస్ డి ఎం న్యూస్):
హైదరాబాద్ నగరం లోని ఎల్‌బీ నగర్ నాసా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో న్యూరో అండ్ స్పైన్ అంశంపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవగాహన సదస్సు (సి ఎం ఈ ) సెషన్‌కు, తెలంగాణ వ్యాప్తంగా 150 మందికి పైగా వైద్యులు మరియు వైద్య నిపుణులు హాజరయ్యారు. న్యూరాలజీ మరియు స్పైన్ చికిత్సలలో నూతన శస్త్ర చికిత్స విధానాలు, ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.నాసా హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ ఖాన్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ నాసా హాస్పిటల్స్ బెంగళూరు, విజయవాడ తో పాటు హైదరాబాదులో హాస్పిటల్స్ సేవలందిస్తుందని త్వరలో జాతీయ, అంతర్జాతీయంగా మరిన్ని నగరాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.సీనియర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అండ్అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మూర్తి న్యూరో మరియు స్పైన్, భారతదేశంలో పెరుగుతున్న ప్రాముఖ్యతను మరియుదేశీయఆరోగ్యరంగంలో దీని కీలక పాత్రను వివరించారు.ఈ సందర్భంగా నాసా హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ళ హాస్పిటల్లో
నిర్వహించిన ఆరు క్లిష్టమైన న్యూరో కేసులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యూరాలజీలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. శివాని తెలిపారు. అనంతరం డాక్టర్ ఆర్‌టిఎస్ నాయక్ నేతృత్వంలోని ప్రశ్నోత్తర సెషన్ వేదికను నిర్వహించారు.
