దర్శి సబ్ జైలు లో కార్యకర్తలను పరామర్శించిన బూచేపల్లి అన్నా రాంబాబు

పొదిలి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భముగా జరిగిన గొడవ లో అక్రమంగా అరెస్ట్ చేసి దర్శి సబ్ జైలు లో వున్న పార్టీ కార్యకర్తలను శుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శిచారు.ఈ సందర్భముగా దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ….పొగాకు రైతుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా ఉండటానికి పొదిలి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భముగా టి. డి. పి నాయకులు దురుద్దేశం తో నిరసన ప్రదర్శన చేసి మా ర్యాలీ మీద చెప్పులు రాళ్ళు వేసి మా కార్యకర్తలను గాయపర్చారని… ఇప్పుడు ప్రభుత్వ పెద్దల వత్తిడి తో వారి మీద కేసు లు పెట్టకుండా …మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగన్ ప్రభంజనం చూసి కూటమి ప్రభుత్వం ఏమి చెయ్యాలో అర్థం కాక ఇలా కేసులు పెట్టీ వేధించడం ఏంటని ప్రశ్నించారు. జైలు లో వున్న కార్యకర్తల కు ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది అని భరోసా కల్పించి వారి కుటుంబ సభలను కూడా మనో దైర్యం గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్కాపురం ఇంచార్జీ అన్నా రాంబాబు ,కనిగిరి ఇంఛార్జి దద్దాల నారాయణ పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *