రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: కిమ్స్ హాస్పిటల్స్- 100 మందికి పైగా రక్తదానం

(జే ఎస్ డి ఎం న్యూస్) హైదరాబాద్, 14 జూన్  అంతర్జాతీయ రక్తదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని, కిమ్స్ హాస్పిటల్స్  సికింద్రాబాద్  ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వైద్యులు, సాధారణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ సీఓఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ, “రక్తదానం అనేది అనేక మందిని కాపాడే మహత్తరమైన పని. ప్రతి దాత సమాజానికి వెలకట్టలేని సేవ చేస్తున్నాడు. కిమ్స్ హాస్పిటల్ తరపున మనం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ, రక్త అవసరాలను తీర్చే బాధ్యతను నెరవేర్చుతున్నాం” అని తెలిపారు.ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని అత్యవసర పరిస్థితులలో చికిత్స పొందుతున్న రోగులకు అందుబాటులో ఉంచనున్నారు. రక్తదానం యొక్క ప్రాధాన్యతను ప్రజల్లో పెంపొందించేందుకు కిమ్స్ వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాబొరేటరి  విభాగాధిపతి డాక్టర్ రాధిక, మరియు బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.ఎస్. రెంగన్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *