స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ- ఫిక్కీ నేషనల్ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ కో చైర్, జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి

(జేఎస్ డి. ఎం న్యూస్ ) హైదరాబాద్, జూన్ 2025: స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణ అని ఫిక్కీ నేషనల్ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ కో చైర్, జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ వివాంతా బై తాజ్‌లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఎంఎస్ఎంఈ ఎక్సలరేట్ 2025’ను జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి, ఎన్ఎస్ఐసీ జోనల్ హెడ్, జీఎం వీ సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ అట్లూరి మాట్లాడుతూ మన దేశంలో తయారైన డ్రోన్లు, డిటెక్టర్లు, జామర్లు, రాడార్లతో చైనా డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ఆర్ అండ్ డీ అనేది ఒక వృధా ఖర్చు కాదన్నారు. ఇది అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలు ఎంత బిజీగా ఉన్నా, పరిశోధనలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సరైన దిశను గుర్తించి దానిపై దృష్టి పెట్టితే విప్లవాత్మక మార్పులు సాధ్యమన్నారు. భారతదేశం అంతర్జాతీయంగా ముందంజలో నిలవాలంటే లోకల్ మార్కెట్లకే కాకుండా, ప్రపంచ మార్కెట్ల కోసం కూడా ఆవిష్కరణలు చేయాలన్నారు. అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా దీర్ఘకాలిక విజయాలను సాధించవచ్చన్నారు. ఆర్‌ అండ్ డీ మన దేశాన్ని గ్లోబల్ నాయకత్వం వైపు తీసుకెళ్తుందన్నారు. ఇకపై భారతదేశంలో పెట్టుబడి పెద్ద అడ్డంకి కాదన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఎన్ఎస్ఐసీ జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ వీ సురేష్ బాబు మాట్లాడుతూ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఐఎస్ఓ సర్టిఫైడ్ సంస్థ అన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను విక్రయించేందుకు కీలక భూమిక పోషిస్తున్నామని తెలిపారు. ఎన్ఎస్ఐసీలో సభ్యత్వం పొందిన ఎంఎస్ఎంఈలకు అనేక లాభాలు కలవన్నారు. ముఖ్యంగా టెండర్ ఫీజు, భద్రతా డిపాజిట్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడం సులభం అవుతుందన్నారు. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ప్రకారం.. పీ ఎస్ యూలు తమ అవసరాలలో కనీసం 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి పొందడం తప్పనిసరి అన్నారు. ఇది ఎంఎస్ఎంఈలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన సువర్ణావకాశం అన్నారు. ఎగ్జిబిషన్లలో పాల్గొనడం ద్వారా ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఎన్ఎస్ఐసీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. దేశీయ ప్రదర్శనల్లో పాల్గొనటానికి 80 శాతం వరకు సబ్సిడీ కూడా ఇస్తుందన్నారు. మార్కెటింగ్ మద్దతు నుంచి ఆర్థిక సహాయం వరకు ఎంఎస్ఎంఈ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామిగా పని చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఫిక్కీ తెలంగాణ డిఫెన్స్ & ఏరోస్పేస్ కమిటీ చైర్మన్ పీ రాధాకిషోర్ భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. నిబంధనల సడలింపు, అనువైన విధానాలు, అనేక పథకాలతో మద్దతు అందించిందన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పరిమితంగా ఉందన్నారు. జాతీయ జీడీపీ, ఉపాధిలో కీలక పాత్ర పోషించే ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత అవసరమన్నారు. ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలు చిన్న పరిశ్రమల నుంచే వస్తున్నాయన్నారు. పెద్ద కంపెనీలు తమ లక్ష్యాలు సాధించడానికి ఈ ఆవిష్కరణల మీదే ఆధారపడతాయని చెప్పారు. భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుకుగా పని చేయాలన్నారు. ఎంఎస్ఎంఈల ఆధ్వర్యంలోని సాంకేతికత, ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి ద్వంద్వ ఇంజిన్ల వంటివన్నారు.

ఈ సందర్భంగా ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ వీవీ రామరాజు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివన్నారు. అవి దేశ జీడీపీలో దాదాపు 30 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. కానీ ఇవాళ పరిశ్రమల వేగంగా మారుతున్న దశలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేదికను ఉపయోగించుకొని మనం కలిసి పని చేయాలన్నారు. అసలైన మార్పును సాధిద్దామన్నారు. తద్వారా ఎంఎస్ఎంఈలను ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేలా చేద్దామన్నారు.

ఈ సందర్భంగా దీప్తి గడ్డం మాట్లాడుతూ దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటాతో 10 కోట్ల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయన్నారు. తెలంగాణలో ఇవి గ్రామీణ కళాకారులు నుంచి టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ స్టార్టప్‌లు, మెడ్‌టెక్ ఆవిష్కర్తలు, సేవా రంగంలో మార్గదర్శకుల వరకు విస్తరించి ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు డిజిటల్ విప్లవం, హరిత మార్పిడి అనే కూడలి దగ్గర నిలిచి ఉన్నాయన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ సదస్సులో ముఖ్యమైన ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. అందులో ఒకటి ఈఎస్జీ ప్రమాణాలు – ఎంఎస్ఎంఈల కొత్త వ్యాపార ఆవశ్యకత’ అనే అంశంపై చర్చ జరిగింది. ప్రమాదాలు అధిగమిస్తూ.. అవకాశాలను అన్వేషించడం, చిన్న వ్యాపారాల్లో ఈఎస్జీని విజయవంతంగా అమలు చేయడం దీని థీమ్. రెండో ప్యానల్ చర్చ ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీలతో ఎంఎస్ఎంఈలను విప్లవాత్మకంగా మార్చడం అనే అంశంపై జరిగింది. ప్రచార స్థాయి నుంచి వ్యాపార విలువ దిశగా తక్కువ ఖర్చుతో, స్కేల్ చేయగల సాంకేతిక పరిష్కారాల ద్వారా ఆపరేషనల్ ఎక్సెలెన్స్ సాధించడం థీమ్.‌ ఇంటరాక్టివ్ సెషన్.. ‘నిధులు – లోన్లు, గ్రాంట్లు, క్రెడిట్ స్కోర్లు’ అనే అంశంపై జరిగింది. ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్థిక సాధనాలు, డిజిటల్ రుణాలు, రంగాలకు అనుగుణంగా రూపొందించిన పరిష్కారాలు దీని థీమ్. ఈ సెషన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వర్క్‌షాప్ ‘క్లౌడ్ లోకి ప్రవేశించి వృద్ధిలోకి పయనం – ప్రారంభం నుంచి విస్తరణ వరకు’ అంశంపై జరిగింది. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి క్లౌడ్ పరిష్కారాలను వినియోగించడం దీని థీమ్. సెషన్ ‘ఐపీఓ మార్గం – లిస్టింగ్‌కి మొదటి అడుగు’ అంశంపై జరిగింది. ఇది ఎంఎస్ఎంఈ లకు షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ ప్రక్రియకు సంబంధించిన అవగాహనను అందించింది. ఈ సదస్సు వ్యాపారవేత్తలు, పాలసీ మేకర్లు, టెక్నాలజీ నిపుణులు, ఆర్థిక సంస్థలు, స్టార్టప్‌లు, విద్యావేత్తలను ఒకే వేదికపైకి తీసుకు రావడంతో శక్తివంతమైన వేదికగా నిలిచింది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371 / 9963980259

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *