అమ్మఒడికి కోతలు పెట్టి తల్లుల్ని మోసం చేసిన జగన్ కి తల్లికి వందనంపై మాట్లాడే అర్హత ఉందా? అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి జగన్ ని నిలదీశారు. శనివారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో
32 మంది లబ్ధిదారులకు రూ. 18 లక్షల విలువైన సీఎం.ఆర్. ఎఫ్ చెక్కులు మంత్రి అందజేశారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో రూ.12 కోట్ల విలువైన సీఎం.ఆర్. ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……సంక్షేమానికి సరికొత్త నిర్వచనం తల్లికి వందనం. నాడు..నాన్నకు ఇంథనం పేరుతో నాసిరకం మద్యంతో జగన్ పేదల నుంచి వేల కోట్లు దోచుకున్నారు. నేడు తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు నేడు 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10వేల కోట్లుజమ చేశారు. గతంలో కంటే 24.5లక్షల మంది తల్లులకు అదనంగా తల్లికి వందనం. వైసీపీకి మహిళలు ఓటెయ్యలేదని జగన్ వారిపై కక్ష పెంచుకున్నారు. అందుకే మా పాలనలో మహిళలు సంతోషంగా ఉంటే జగన్ ఓర్వలేక పోతున్నారు. పాలన అంటే బటన్ కాదు… భవిష్యత్తు నిర్మాణం అనే విధంగా కూటమి పాలన సాగుతోందని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు.
