“యోగాంధ్ర- 2025” మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ యోగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా జూన్ 15వ తేదీన సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఒక ప్రకటన లో తెలిపారు. ఈ యోగ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ యోగ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని, యోగ కార్యక్రమానికి హాజరుగు వారు తమతో పాటు యోగ మ్యాట్ ను తీసుకురావలసిందిగా తెలపడమైనది.
నేటి యోగేంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
14
Jun