యోగాతో జీవనం ఎంతో మెరుగుపడుతుందని వక్తలు అన్నారు. మండలంలోని అన్నిపంచాయితీల పరిధిలో శనివారం యోగా బ్యాసంపై అవగాహన తరగతులు నిర్వ హించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దార హనుమంత రావు, తహసీల్దార్ సంజీవ రావు, ఎంఈఓ-2 సుధాకర రావులు పాల్గొని యోగా బ్యాసం విశిష్టతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడి వడిగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికి క్రమ శిక్షణతో కూడిన జీవనాన్ని అలవాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా పంచాయితీలలో, పాఠశాలలలో చేస్తున్న యోగా భ్యానంపై గ్రామకార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
