బేగంపేట జూన్ 15 (జేఎస్డిఎం న్యూస్) :
సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. రాంగోపాల్ పేట డివిజన్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఘన్ శ్యామ్ ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నెక్లెస్ రోడ్ అంబేద్కర్ నగర్ లోని నివాసానికి వెళ్లి ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రాంగోపాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు గణేష్ తదితరులు ఉన్నారు.

