బేగంపేట జూన్ 15(జే ఎస్ డి ఎం న్యూస్)
రాంగోపాల్ పేట డివిజన్ కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడిని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. కళాసిగూడ కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు మాతృమూర్తి సత్యమ్మ ఇటీవల మరణించగా, ఆదివారం
వారి ఇంటి వద్ద నిర్వహించిన దశదిన కర్మకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యమ్మ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఆంజనేయులు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, ఆకుల హరికృష్ణ, విజయ్,చందుచారి,దేవేందర్ చారి, నరేష్ ఆరీఫ్ తదితరులు ఉన్నారు.

