గద్దర్ అవార్డును మరో నందీ అవార్డుగా మార్చేశారా.! ప్రొఫెసర్ కంచ ఐలయ్య.

హైదరాబాద్ జూన్ 15( జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ లో శనివారం జరిగిన గద్దర్ అవార్డుల ప్రెజెంటేషన్ అనేది సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందనీ,ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సంస్కృతిని భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడి, పాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, పాటల రచయితలను తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం చాలా విచారకరం. నేను గద్దర్ కు చాలా దగ్గరి మిత్రుడిని, గద్దర్ ను కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వమని ఒప్పించిన వాడిని. నాకు కూడా ఆహ్వానం రాలేదు, ఇలా చాలా మందికి రాలేదు. నేను రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. అందుకు ప్రతిగా దూషణలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతిలో కొత్త విప్లవం మొదలవుతుందని భావించాను. కానీ ఇప్పుడు సినిమా రంగాన్ని ఏయే కులాలు ఆధిపత్యం చేస్తున్నాయో, ఎవరు పెత్తనం చేస్తున్నారో అందరికీ తెలుసు. వారు తెలంగాణ ప్రజల సంస్కృతి పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో కూడా మనకు తెలుసన్నారు.సినిమా అంటేనే డబ్బు కోసం అన్నట్లు ఉంది. ఇలా డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా సంస్కృతిని మార్చి, ఫూలే తరహా కొత్త తెలుగు సినిమా నిర్మాణ సంస్కృతిని తీసుకురావాలని గద్దర్ అవార్డు ద్వారా ఆశించాం. కానీ అటువంటి కొత్త ప్రారంభం ఎక్కడా కనిపించలేదు. అవార్డు జ్యూరీలో ఒక్క జానపద కళాకారుడు కూడా లేడు. అందరూ డబ్బు కోసం పనిచేసే సినిమా కళాకారులే. ప్రజల కళలకు ప్రాతినిధ్యం ఎక్కడ. జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎక్కడా.గద్దర్ పాపులర్ పాట అయినా “పొడుస్తున్న పొద్దుమీద” అనే పాటకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ కళాకారులు ఎక్కడ. గద్దర్ అంటేనే ప్రజా పాట. అవార్డు ప్రదాన సమయంలో అటువంటి ప్రజా పాటల, ప్రజా కళాకారులకు సంబంధించిన ప్రజా కళల ప్రతినిధులు ఎక్కడ అన్నారు.
గద్దర్ అవార్డును మరో నందీ అవార్డుగా మార్చేశారా అని ఆయన ప్రశ్నించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *