ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ముఖ్యం….. బీ జే పి సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ (నందు).

బేగంపేట జూన్ 15(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ముఖ్యం అని సీనియర్ బీ జే పీ నాయకులు నెమలి ఆనంద్ అన్నారు.ఆదివారం సంజీవ్ రెడ్డి నగర్‌లోని కోర్ కరాటే బుడోఖాన్ వే క్లాస్‌ను నెమలి ఆనంద్ సందర్శించారు.అక్కడ అంకితభావంతో శిక్షణనిచ్చే ఇన్‌స్ట్రక్టర్లకు మరియు ఉత్సాహభరితమైన విద్యార్థులకు లాల్ బహదూర్ స్టేడియంలో జూన్ 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 1-డే కౌంట్‌డౌన్ సెలబ్రేషన్‌కు హాజరయ్యేలా హార్దిక ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని మరింత బాగా ఉండేట్లు చూసుకోవాలని అన్నారు.ఎవరికి వారు తమను తాము అత్యవసర పరిస్థితులలో రక్షించుకునేందుకు కరాటే వంటి వాటిని ఖచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *