వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి ఆ పార్టీ మండల యూత్ విభాగం అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు
ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. చీమకుర్తిలోని వారి నివాసానికి స్థానిక నాయకులతో కలిసి వెళ్లి విష్ణు తనకు మండల స్థాయిలో యూత్ విభాగం అధ్యక్షుడుగా పార్టీ అధిష్టానం నియమించేందుకు తగిన కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని గజమాలతో సన్మానించారు.
మండల పార్టీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, నాయకులు యత్తపు మధుసూదన్ రెడ్డి, గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి(గోల్డ్), పులి రమణారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
