వికృత చేష్టలు చేస్తే డోంట్ టచ్ అంటూ హెచ్చరించాలి – ఎస్సై మల్లికార్జునరావు

సమాజంలో బాలికల పట్ల తమ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు
వికృతంగా వ్యవహరిస్తే డోంట్ టచ్ అంటూ దైర్వంగా హెచ్చరించి, తమను తాము కాపాడుకోవాలని స్థానిక ఎస్.ఐ ఎస్.మల్లిఖార్జునరావు సూచించారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశానుసారం పోలీసుల ఆద్వర్యంలో స్థానిక వి.కె. ఏ బి సి హై స్కూల్ ల లో బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై సోమవారం అవగాహన కల్గించారు. ఎస్.ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో పాఠశాలల వద్ద సహచర పురుష విద్యార్థులు, ఉపాద్యా యులు, బంధువులను బాలికలను దగ్గరగా తీసుకొని వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ .. తగలరాణి చోట చేతులతో తాగినట్లయితే వెంటనే డోంట్ టచ్. ..అంటూ గట్టిగా హెచ్చరించాలని తెలిపారు. వారు ఏదైనా ఇబ్బందులు వుంటే తల్లి దండ్రులు తెలిపి వారి ద్వారా తక్షణమే 1098 నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్లో వారి వివరాలను అందించాలన్నారు. ఏ.బి. సి హైస్కూల్లో ఏఎస్ఐ మోహన్ రావు పాల్గొని విద్యార్థులకు గుడ్డు టచ్ ప్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించారు. మైనర్లు మోటార్ వాహనాలను నడపవద్దని కోరారు.
కార్యక్రమం లోహెచ్ఎం శ్రీనివాసరావు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *