గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పలువురు అధికారులు బదిలీలు

ఇటీవల జరిగిన సాధారణ బదిలీల కౌన్సిలింగ్ లో భాగంగా మండలంలోని పలుగ్రామపంచాయతీ కార్యదర్శులను ఇతరప్రాంతా లకు బదిలీ చేయగా, కొందరిని తాళ్లూరు మండలానికి బదిలీ చేస్తూ డిపీవో ఉత్తర్వు లు జారీ చేశారు. మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ కార్యదర్శి టి.అజయ్ కీర్తి ని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు బదిలీ చేశారు. ఆయనస్థానే కొనకనమిట్ల మండలంపెద ఇర్లపాడు గ్రామపంచాయతీ కార్యదర్శి డి.నాగమల్లేశ్వ రిని తూర్పుగంగవరంకు బదిలీ చేశారు. మల్కాపురం కార్యదర్శి పివిఎన్ పవన్ ను చీమకుర్తిమండలం ఏలూరివారిపాలెం పంచాయతీకి బదిలీ చేశారు. ఆయనస్థానే దొనకొండ మండలం మంగినపూడి పంచాయతీ కార్యదర్శి ఈవీశేషమ్మను బదిలీ
చేశారు.మండలంలోని బొద్దికూరపాడు పంచాయతీ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం
ను విఠలాపురం గ్రామ పంచాయితీకి బదిలీ చేశారు. శివరాంపురం పంచాయతీ కార్యదర్శి వై.రాజారమేష్ ను మద్దిపాడు మండలం దొడ్డవరంకు బదిలీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రిలీవైన డిప్యూటీ తహ సీల్దార్ జే.ఇమ్మానియేల్రాజు
గత 10 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో వివిధ హోదాల్లో పని చేసిన డిప్యూటీ తహసీల్దార్ జే. ఇమ్మానియేల్ రాజు సోమవారం విధుల నుండి రిలీవ్ ఆయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో డీటీ రాజు కనిగిరి ఆర్డీవో కార్యాలయ డీటీగా బదిలీ అయ్యారు. సర్వేయర్ శ్రీనివాసరావును అద్దంకి పట్టణానికి బదిలీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *