కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్ధిక స్వావలంభన సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
, మెప్మా అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంగోలు కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మెప్మా అధికారులతో సమావేశమై జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా అమలు చేస్తున్న పధకాలు, కార్యక్రమాల అమలును సమీక్షించి దిశానిర్దేశం నిర్దేశం చేశారు. జిల్లాలో 9545 స్వయం సహాయక సంఘాలు, 326 మురికివాడ సంఘాలు మరియు 8 పట్టణ సంఘాలు, 326 మంది రిసోర్స్ పర్సన్స్ స్లమ్ ఫెడరేషన్ మరియు పట్టణ సమాఖ్య కింద విధులు నిర్వహిస్తున్నారని, మహిళాకాసం యాప్లో స్వయం సహాయక సంఘాల గురించి సమగ్ర సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు మెప్మా పిడి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రెగ్యులర్ లైవ్లి హుడ్ యూనిట్స్ ఆక్షన్ ప్లాన్ 2025-26 లో నిర్దేశించిన లక్ష్యాల సాధనలో వంద శాతం లక్ష్యాన్ని సాధించేలా మెప్మా అధికారులు కృషి చేయాలన్నారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, ఫుడ్, సర్వీస్, ట్రేడింగ్ మరియు ఇతర సెక్టార్స్ లో స్వయం సహాయక సంఘాలకు అవసరమైన మార్కెటింగ్ నైపుణ్యాలలో శిక్షణ, చేయూతనిచ్చి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి మరింత పటిష్టంగా వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి కార్యకలాపాల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, తృప్తి హోటళ్ళు మొదలైన వినూత్న అవకాశాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుచున్నదన్నారు. ఈ అవకాశాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకొని ఆర్ధిక స్వావలంభన సాధించేలా మెప్మా అధికారులు కృషి చేయడంతో పాటు బ్యాంక్ లింకేజి మంజూరు, తృప్తి క్యాంటిన్స్ ఏర్పాటు, స్మార్ట్ స్ట్రీట్స్, టెర్రస్ గార్డెన్, ఈ కామర్స్ ప్రమోషన్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించేలా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, మెప్మా అధికారులను ఆదేశించారు.
ఈనెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఒంగోలు నగరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సదరు కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ కచ్చితంగా ఉదయం 6 గంటలకు హాజరైలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మెప్మా పిడి ని ఆదేశించారు.
ఈ సమావేశంలో మెప్మా పిడి శ్రీహరి, సిఓ లు, ఆర్పి లు తదితరులు పాల్గొన్నారు.


