వ్యవసాయ విద్యుత్ ను సక్రమంగా ఇవ్వకుండా ఇష్టాను రీతిగా మరమ్మత్తుల పేరుతో విద్యుత్ ను నిలిపివేస్తున్న లైన్ మెన్ నిర్వాకంపై తాళ్లూరు దక్షణ పొలం రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యం మూడు నాలుగు గంటల పాటు ప్రభుత్వం విద్యుత్ కోత లేక పోయినా నరే స్థానిక లైన్ మెన్ నిర్వాకంతో విదులై సరఫరాలో లోపం ఉందంటూ ధ్వజం ఎత్తారు. విద్యుత్ సరఫరాపై సమాచారం అడిగినా నరే సక్రమంగా ఇవ్వక తప్పించుకు తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఇన్చార్జి విద్యుత్ ఎఈ సైతం సమాచారం సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇదే విధంగా విద్యుత్ సరఫరా చేస్తే పంటలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విధానం కొనసాగించితే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కొంత సేపు ఆందోళన చేసి విరమించారు.
