పాముల కాలనీ వాసులకు చెందిన స్థలం విషయం పరిష్కరించకుండా సంవత్సరాల పాటు సమస్యను నార్చటంపై పాముల కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తమకు చెందిన స్థలంను ఇతరులు ఆక్రమించుకుని వాడుకుంటూ తమకు కేటాయించాలని కోరినప్పటికి ఇప్పటి వరకు రెవిన్యూ అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకుని తమకు అప్పగించక పోక పోవటంపై తమ పాముల కాలనీ వానులు అంటే ఎంత నిర్లక్ష్యమో ఇట్టే అర్ధం అవుతందని వాపోయ్యారు. దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక నాయకులు దృష్టికి తీసుకువెళ్లినా తమ నమన్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇక నైనా నమస్య పరిష్కారం చేయకుంటే జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని తెలిపారు.
