నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై నిరంతం వ్యవసాయశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరంలో పలు దుకాణాలను ఆయన బుధవారం తనిఖీ నిర్వహించారు. లూజు విత్తనాలు తీసుకువచ్చి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి రైతులను మోసం చేస్తే విత్తన చట్టాన్ని కఠినంగా అమలు చేసి తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. తూర్పుగంగవరంలో వెంకట సాయి రైతు డిపోను అకస్మిక తనిఖీ చేసారు. బిపిటీ 5204, కె ఎన్ ఎం 1638, ఐ పి ఎం 2-14, వరి, పెసర రకాల శ్యాంపిల్స్ తీసుకుని రీజినల్ కోడింగ్ సెంటర్ తాడేపల్లి గూడేం పంపుతున్నట్లు తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు మొలక శాతం నిర్ధారించుకుని తదుపరి నారు పోసుకోవాలని కోరారు.
