అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే వారికి అవసరమైన సాధన, సర్టిఫికెట్ల ప్రదానముపై
మరింతగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
చెప్పారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ హాజరయ్యారు. యోగాసనాలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని వేదికల వారీగా ట్యాగ్ చేసి, సకాలంలో వచ్చి పాల్గొనేలా పర్యవేక్షించాలని విజయానంద్ చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డీఈవో కిరణ్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భీమ్ నాథ్, డిఆర్డిఏ పి.డి. నారాయణ, మెప్మా పీ.డీ. శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

