వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యుడు డాక్టర్
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆ పార్టీ మండల అనుబంధ విభాగం మండల రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల వెంకట శ్రీనివాసులురెడ్డి, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు కైపు అశోక్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్.సి సెల్ అధ్యక్షుడు యామర్తి ప్రభు దాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ లతీఫ్ (బచ్చా), ఉపాధ్యక్షుడు ఆలోకం హరిబాబులు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. దర్శిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి వెళ్లి తమకు మండల స్థాయిలో పలు విభాగాల అధ్యక్షులుగా పదవి వచ్చేలా కృషిచేసినందుకు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గజమాలతో సన్మానించారు. పార్టీ అధ్యక్షుడు టి.వి సుబ్బారెడ్డి, జిల్లా సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షుడు, విఠలా పురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు , సయ్యద్ లతీఫ్, సైదా, నాయకులు సంగు కొండారెడ్డి, కటకంశెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం తదితరులు పాల్గొన్నారు.


