తాళ్లూరు మండల సమావేశం రసాబాసప్రజా ప్రతినిధులను తూలనాడిన తహసీల్దార్ –

తహసీల్దార్ పనితీరుపై ఆగ్రహించిన ప్రజా ప్రతినిధులు
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు లేచితనదైన శైలిలో నమస్కరిం చిన ఎంపీపీ -ప్రొటోకాల్ అమలు చేయటం లేదంటూ ఆగ్రహించిన వైస్ఎంపీపీ, ఎంపీటీసీలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజా ప్రతినిధులపట్ల బాధ్యతా వ్యహరించాల్సిన తహసీల్దార్ మండల సమావేశంలో ప్రజా ప్రతినిధులపై వింత ధోరణిలో మాట్లాడటంతో జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ఎంపీపీ, పలుగ్రామాల సర్పంచ్ లు తహసీ ల్దార్ విదానాన్ని ఎండగడుతూ తీవ్రంగా ఆగ్రహించారు. స్థానిక ఎంపీపీ సమావేశం హాలులో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసులు అధ్యక్షతన మండ సర్వసభ్యసమావేశం
జరిగింది. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి రెవెన్యూ సమస్యలపై మాట్లాడుతూ మండలంలోని గతంలో జరిగిన రీసర్వే వల్ల భూసమస్యలు ఏర్పడి గ్రామాల్లో రైతాంగం
ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి నిర్వహించిన గ్రామ సభల్లో, ఎన్ని వినతులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారో తహసీల్దార్ సభ్యులకు వి వరించాలని కోరారు. తహసీల్దార్ కె.సంజీవరావు మాట్లాడతూ …జడ్పీటీసీ అడిగిన ప్రశ్నకు సమాదానం ఇవ్వకుండా సిబ్బంది కొరత వుందని చెపుతుండగా ఆ విషయాన్ని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుక వెళ్లారా అని అడుగగా మీకు చెప్పాల్సిన అవసరం లేదని, మీతో మాకు సంబంధం ఏమిటని వింత దోరణిలో నిర్లక్ష్యంగా సమాధాన
మిచ్చారు. దీంతో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివా రావు, వైస్ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, కాలేషావలిలు తహసీల్దార్ మాట్లాడిన విషయమై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మండల సమావేశంలోనే కీలక ప్రజా ప్రతినిధులను అగౌరవ పరుస్తూ మాట్లాడం సంస్కారం కాదన్నారు. వయస్సులో పెద్దవారైవుండి ఇలా మాట్లాడటం ఏమిటని నిలదీశారు. గ్రామాల్లో ప్రజలు రెవెన్యూ శాఖలో పనులు కావటం లేదని తమకు చెపుతున్నారని, ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుక వస్తే బాధ్యతా రాహితంగా వ్యవరిస్తూ మట్లాడారంటే గ్రామాల్లో ప్రజల సమ్యలు ఏవిధంగా పరిష్కరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. తహసీల్దార్ వచ్చిన నాటినుండి ప్రజల రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మీకు మార్పు రాక పోవటం ఏమిటని నిలదీశారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మండలస్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు సమావేశానికి ఆలస్యంగా రావటంపై తీవ్రంగా ఆగ్రహించారు. సమావేశం
జరుగుతుండగా ఆలస్యంగా సమావేశానికి వచ్చిన ఉద్యో గులకు ఎంపీపీ స్వయంగా సీటులోనుండి పైకి లేచి నమస్కారం సర్ ..అంటూ సంభోదింటం అందరిని
ఆశ్చర్యపరిచింది. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధులు వచ్చి కూర్చున్న తరువాత ఉద్యోగులు రావటం బాగోలేదన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంగా ముందుకు వెళితే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంద న్నారు. టీడీపీ ప్రభుత్వం కొత్త పథకాలను లబ్దిదారులకు చేరవేస్తున్నా ప్రజాప్రతినిధులను కూడా పిలక పోవటం మంచి పద్దతి కాదన్నారు. తాము ఏమిచేసినా ప్రజా ప్రతినిధులు తమను ఏమిచేయలేరన్న ధోరణితో వున్నారని,
ఆపద్దతి మార్చుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాదిహామీ పధకం పనుల్లో పనులకు వెళ్ళని అధికారపార్టీకి చెందిన నవులూరి విద్యాసాగర్, నరేంద్రకుమార్ ఇంకా పలు పేర్లు మస్టర్ల తో హజరువేశారని ఆ రోపించారు. గ్రామంలో ఒ క వర్గానికే ఏకప క్షంగా చేయటం ఎంతవరకు న్యాయమని ఉపాధి ఏపివోను నిలదీశారు. పనికి రాని వారికి మస్టర్ల వేసి ఎవరి వాటా వారు తీసుకుంటుంన్నందన సర్పంచ్ గా మా వాటా మాకు చెల్లించాలని సభ లో ఏపీవోని అడగటం అందరినీ సభ్యులను నివ్వెర పరిచింది. వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరు ఎంపీటీసీ వై.ప్రభుదాసు మాట్లాడుతూ… ఇటీవల తాళ్లూరు కస్తూర్భాగాంధీ విద్యాలయంలో అధనపు గదుల నిర్మాణంకు శిలాఫలకం వేసి ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ప్రజా ప్రతినిధుల మైన మాపేర్లు విస్మరించాన్నారు. ఈవిషయంమై స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్ ని అడుగగా నాకు తెలియదని, కంట్రాక్టర్ చేశారని తెలిపారన్నారు. ప్రజా ప్రతినిధు
లను అ గౌరవ పరిస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుక వెలతామన్నారు. సమావేశం జరుగుతుండగా ఎంపీడీవో నిద్రలోకి జారుకోగా, తహసీల్దార్ మాత్రం సెల్ చూసే
పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీడీవో దారాహనుమంతరావు, తహసీల్దార్ కె.సంజీవరావు, సీడీపీవో సిహెచ్ భారతి, వైద్యులు రాజేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, పశువైధ్యాధికారి వంశి, ఏఈ లు వాలి, హనుమంతరావు, పలుశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *