ఆత్మను, మనసును , శరీరాన్ని ఏకం చేసే సాధనం యోగ అని ప్రతి ఒక్కరూ తమజీవితంలో యోగ ను భాగం చేసుకుని ఆరోగంగా ఉండాలి – ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఆత్మను, మనసును , శరీరాన్ని ఏకం చేసే సాధనం యోగ అని ప్రతి ఒక్కరూ తమజీవితంలో యోగ ను భాగం చేసుకుని ఆరోగంగా ఉండాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పేర్కొన్నారు.
శనివారం ఉదయం ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగాచార్యులు ఏడుకొండలు ఆధ్వర్యంలో యోగ ఔత్సాహికులతో కలసి యోగాసనాలు చేసారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. యోగ యొక్క గొప్పతనాన్ని ప్రయోజనాలను ప్రజలకు అందించాలన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు రూపకల్పనే ప్రపంచమంతా 2014 జూన్ 21 నుండి అంతర్జాతీయ యోగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మను, మనసును , శరీరాన్ని ఏకం చేసే సాధనం యోగ అని అన్నారు. ఈ అపూర్వ యోగ విద్య‌ను సామాన్యుల ద‌రికి చేర్చ‌డం ద్వారా ప్ర‌జ‌లంద‌రినీ ఆరోగ్య‌వంతులుగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నేడు విశాఖ తీరంలో అద్భుతంగా నిర్వహించడం మనమంతా తిలకిస్తావున్నామన్నారు. విశాఖ తీరంలో జరిగే యోగ కార్యక్రమంలో 5 లక్షల మంది యోగ ఔత్సాహికులు పాల్గొనడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ప్రజలు యోగ కార్యక్రమాల్లో పాల్గొనడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించబోతున్నట్లు తెలిపారు. స్థానిక శాసన సభ్యుల సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ ను విజయవంతం చేసినందుకు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ తమజీవితంలో యోగ ను భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు వైజాగ్ తీరంలో జరుగుచున్న యోగ కార్యక్రమంలో భారత ప్రధాని మంత్రి , రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల మంది యోగ ఔత్సాహికులతో పాల్గొనుచున్నారన్నారన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 50 వేల ప్రదేశాల్లో రెండు కోట్ల మంది ప్రజలు యోగ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించబోతున్నట్లు తెలిపారు. గత నెల మే 21 నుండి నెల రోజుల పాటు జిల్లాలో యోగాంధ్ర మాసోత్సవాలను ఘనంగా నిర్వహించినందులకు అన్నీ శాఖల అధికారులకు, ఆయా శాఖల సిబ్బందికి, పూర్తి సహకారం అందించిన ప్రజాప్రతినిధులకు, యోగ సాధకులకు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా 20వ తేదీ శుక్రవారం ఇదే మినీ స్టేడియంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాష్ట్ర స్థాయి యోగ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన మెప్మా, డిఆర్డిఏ పిడి లను ప్రత్యేకంగా అభినందిస్తూ, జిల్లాలో యోగ కాంపిటిషన్స్ ను విజయవంత గా నిర్వహించిన సెట్నల్ సిఈఓను, ప్రత్యేకంగా అభినందిస్తూ రాష్ట్ర స్థాయి యోగ కాంపిటిషన్స్ లో ప్రకాశం జిల్లా చెందిన ఏడు మంది గెలుపొందడం సంతోషదాయకమన్నారు. యోగ సాంగ్ కు రాష్ట్ర స్థాయిలో మన ప్రకాశం జిల్లాకు మొదటి బహుమతి రావడం జరిగిందని, ఈ యోగ సాంగ్ ను ఆలపించిన గాయకులు శరత్ కుమార్ కు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. ఈ రోజు తో యోగ ను ఆపకుండా ప్రతి ఒక్కరూ యోగ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి అన్నీ ప్రాంతాల్లో యోగ యొక్క ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ రోజు వైజాగ్ బీచ్ రోడ్డు లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి , రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనుచున్నారని, ఈ కార్యక్రమం సుమారు ఐదు లక్షల మంది యోగ ఔత్సాహిక లు పాల్గొనుచున్నారన్నారు. ఈ ఒక్క రోజు తో యోగ ఆపకుండా ప్రతి రోజూ యోగ ను సాధన చేయాలన్నారు.

అనంతరం యోగ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో నెలరోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలను ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు కృషిచేసిన జిల్లా అధికారులకు, యోగ సాధకులకు ఈ సందర్భంగా మెమెంటోలను ప్రదానం చేసారు.
ప్రతి మూడవ శనివారం నిర్వహించుకోనుచున్న స్వచ్చ ఆంద్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం ఆవరణలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఆర్ డి ఎ, మెప్మా పిడి లు నారాయణ, శ్రీహరి, జిల్లా విద్య శాఖాధికారి కిరణ్ కుమార్, పశు సంవర్థక శాఖ జేడి రవి కుమార్, డిఎస్ఓ పద్మశ్రీ, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, ఆయుష్ ఆర్డిడి వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థులు యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *