సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ నెంబర్ ను ఉపయోగించుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారము కొరకు “ కాల్ సెంటర్ 1100” ను ప్రవేశపెట్టినదని జిల్లా కలెక్టర్ ఏ తమిమ్ అన్సారియా తెలిపారు. ఈ కాల్ సెంటర్ ద్వారా మీ యొక్క సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదుచేసుకోనవచ్చని తెలిపారు. అర్జీదారులు 1100 నెంబర్ కు డయల్ చేసి, తమ సమస్యను విన్నవించిన యెడల ఆన్లైన్ నందు రిజిస్టర్ చేసి సంబందిత అధికారికి మీ సమస్యను పంపి తద్వారా పరిష్కరించబడును మరియు మీ యొక్క మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా నిర్దారణ సందేశము పంపబడుతుందని తెలిపారు. మీ అర్జీ యొక్క స్థితి /సమాచారం కొరకు 1100 కాల్ చేసి తెలుసైకోవచ్చని తెలిపారు.
కావున, జిల్లా లోని యావన్మంది ప్రజలు మీ యొక్క సమస్యల పరిష్కారము కొరకు ” కాల్ సెంటర్ 1100″ వినియోగించుకొనవలసినది గా కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *