తాళ్లూరు మండలంలో గతంలో జరిగిన రీసర్వేగ్రామాల్లో నెల కొన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, రైతులు తమ రీసర్వే సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దార్ కె.సంజీవరావు ఆదివారం తెలిపారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ల్యాండ్ పొజిషన్ మ్యాప్లో విస్తీర్ణాల్లో తప్పులు జరిగాయన్నారు. దీని వల్ల అన్నదాత సుఖీ భవ, తల్లికి వందనం వంటి పథకాల లబ్ధిపొందేందుకు భూసమస్యలు అడ్డుగా మారాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ ను ఏర్పాటుచేసిందన్నారు. ఈడ్రైవ్లో భాగంగా సాధా రణంగా చెల్లించాల్సిన రూ.500 రుసుంకు మినహాయింపు ఇచ్చి కేవలం నామ మాత్రపు రూ.50 చెల్లించాలన్నారు.
సింగిల్ పట్టాదారులుగా నమోదు కు రైతులు ఆన్లైన్లో రూ50తో ధరఖాస్తు చేస్తే ఉచితంగా సబ్డివిజన్ చేసి, సింగిల్ పట్టాదారులుగా నమోదు చేయటం జరుగుతుందన్నారు.
గతంలో రీసర్వే జరిగిన శివరాంపురం, మల్కాపురం, మాధవరం, దోసకాయల పాడు, శంకనారాయణపురం, సార్వమిట్ట గ్రామాల జాయింట్ పట్టాదారులుగా వున్న రైతులు గ్రామ సచివాలయాల్లో ధరఖాస్తు చేయలన్నారు. రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రీసర్వే గ్రామాల్లో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించుకోవాలి
22
Jun