తాళ్లూరు మండల కాంప్లెక్స్ కు
కు ఫైబర్ నెట్ సేవలు అందించారు. కాని వాటి మరమ్మత్తులకు
గురయిన సమయంలో మాత్రం పట్టించుకోవటం లేదు. కనీనం మండల స్థాయి అధికారులు కూడ వారాల తరబడి నెట్ సేవలు అందక పోయినా నరే వాటిని బాగు చేయింద్దామన్న కనీస చర్యలు ఉండటం లేదు. దీంతో నిత్యం వివిధ రకాల వీడియో కాన్షిరెన్స్ జిల్లా స్థాయి అధికారులు నిర్వహిస్తుండటంతో వాటికి హాజరు అయ్యేందుకు తమకు అనుకూలమైన మండలాల వద్దకు అధికారులు వెళ్ల వలసి వస్తుంది. దీంతో మండలంలో ఆయా శాఖల వద్దకు వివిధ పనులపై వస్తున్న ప్రజలకు ఖాళీ కుర్చీలు దర్శన మిస్తున్నాయి. ఇదేమిటంలే వీడియో కాన్ఫిరెన్స్లకు ఇతర మండలాలకు వెళ్లారనే సమాధానం వస్తున్నది. ఇప్పటికైనా నరే బిఎన్ ఎన్ ఎల్ అధికారులు స్పందించి మండల కార్యాలకు వస్తున్న ఫైబర్ నెట్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
