బెల్లంకొండ వారి పాలెంలో పొలం విషయంలో వివాదం చోటు చేసుకోవటంతో
ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లిఖార్జున రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం
గ్రామానికి చెందిన కూలూరి వెంకట రాజ్యం ఆమె తండ్రి నారాయణ రెడ్డి పొలం వద్దకు ఈనెల 11న రీ సర్వే నిమిత్తం నర్వేయర్ వస్తున్నారని తెలియటంతో ఆమె చెల్లిలు పొశం ప్రభావతితో కలసి పొలంవద్దకు వెళ్లినది. _అక్కడకి అదే గ్రామానికి చెందిన పోశం మధుసూధన రెడ్డి, గూడ అల్లూరి రెడ్డి, గువ్వల శ్రీనివాస రెడ్డి, పోశం నారాయణ రెడ్డి అను వారులు కూడ వెళ్లగా.. పోశం మధుసూధన రెడ్డి ఈ పొలం మాతాత పేరు మీద ఉన్నది ఎక్కడకి మీరు వచ్చేది అంటూ ఘర్షణకు దిగి అనభ్యకరమైన పదజాలంతో ఫిర్యాదు దారులను దూషించి మరోసారి ఈ పొలం వద్దకు వచ్చినట్లయితే మీ తమ్ముడిని, నాన్నను చంపుతామని బెదిరించినట్లు తెలుపుతూ తాళ్లూరు పోలీన్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఎస్సై మల్లిఖార్జున రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రీ సర్వే పొలం వద్ద ఘర్షణ – కేసు నమోదు
23
Jun