కష్టజీవుల పత్రిక విశాలాంధ్ర -73 వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు.

అణుగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం గత ఏడు దశాబ్దాలకు పైగా నిరంతం కృషి చేస్తూ కష్టజీవుల పత్రిక గా సమాజంలో ప్రత్యేక మైన గుర్తింపు పొందిన దినపత్రిక విశాలాంధ్ర అని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విశాలాంధ్ర దిన పత్రిక 73 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి విశాలాంధ్ర జిల్లా కార్యాలయంలో బ్యూరో ఇంచార్జి ఏ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై కేక్ కట్ చేశారు.
అనంతరం ఐవి సుబ్బారావు మాట్లాడుతూ 7 దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో ఎన్నో పత్రికలు ఆవిర్భించి, కనుమరుగు కాగా ఒక్క విశాలాంధ్ర మాత్రం ఎదురు లేకుండా ప్రజల మధ్యన నిరంతరం తిరుగుతుందని అన్నారు.
విశాలాంధ్ర పత్రిక కూడా అనేక సవాళ్లను,సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆదరాభిమానాలతో వాటిని అధిగమించి అజేయ శక్తిగా నిలిచిపోయిందని ఆయన అన్నారు.
విశాలాంధ్ర దిన పత్రిక మరింత పురోభివృద్ధితో ముందుకు సాగాలని ఎపియుడబ్లూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎపియుడబ్లూజే బాపట్ల, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు సిహెచ్ రాంబాబు,ఎన్ వి రమణ, కార్యదర్శి డి. కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి. వెంకట రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె ఇఫ్తేకర్ భాష, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయ కుమార్, ఎస్ కె హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *