ఈనెల 24న ఒంగోలు పీఎజి కన్వేన్షన్ సెంటర్లో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని రాష్ట్ర అసంఘటిక కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్, దర్శినియోజక వర్గ సమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి కోరారు. జిల్లాలో తమ మండల పరధిలోని అన్ని కమిటీల బాధ్యులు, నాయకులు, జిల్లా అనుసంభ సంఘాల అధ్యక్షుతు, కార్యవర్గ సభ్యులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరంట్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెన్ పార్టీకి వైఎన్ షర్మిల దిశా నిర్ధేశం చేయటానికి వస్తున్నారని కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ విజయవంతం చెయ్యాలని కోరారు. అసంఘటిత కార్మికుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సుధీర్ వర్మ, ఉపాధ్యక్షుడు షేక్ రసూల్, అంకబాబు తదితరులు పాల్గొన్నారు.
