సాంఘిక సంక్షేమశాఖ వనతి గృహాములలో పాత వస్తువుల కొనుగోలుకు కొటేషన్స్ ఆహ్వానం – జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్

ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహములలో నిరుపయోగంగా ఉన్న పాత సామానులు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారి నుండి కొటేషన్స్ ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. పాత సామానులు అనగా ఇనుము, స్టీల్, అల్యూమినియం, పాత పుస్తకాలు, ప్లాస్టిక్, ఇత్తడి మరియు రాగి కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు. ఈనెల 23 నుండి 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడునని తెలిపారు. ఐటెమ్స్ వారిగా కోటేషన్స్ ఒకే దరఖాస్తులో సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమశాఖ, ప్రగతి భవన్, ఒంగోలులో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *