ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది. సదరు కేసు విచారణ అధికారి ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు , నాగులప్పల పాడు ఎస్సై రజియా సుల్తాన్, సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది కలసి అమ్మనబ్రోలులోని ఆళ్ల సాంబశివరావు ఇంటిలో సోదాలు నిర్వహించారు. సాంబశివరావు ఇంట్లో ముద్దాయిలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, కీలకమైన పత్రాలు, ఖాతాల పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రికార్డింగ్స్ వంటి పలు అంశాలను అధికారులు పరిశీలించారు. ఇంకా కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, నిందితుల సంబంధాలు వెలుగులోకి తీసుకురావడంపై పోలీసులు దృష్టి సారించారు. ముప్పా సురేష్ ఇంటి వద్ద వారి కుటుంబ సభ్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

